Telangana News:వాళ్లంతా రైతులు తమ పొలాల్లో ఓ చోట ఇటీవలే కోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. సరైన మావ్చర్ రావాలని, మంచి ధర పొందాలనేది ఆ రైతుల ఆశ. ఎందుకంటే సరైన మాశ్చర్ లేదని ధర దిగ్గొస్తరనే దిగులు. ఈ రోజు (మార్చి 29) ఉన్నట్టుండి ఆరబెట్టుకున్న ధాన్యాన్ని తొలగించాలని అధికారులు హుకూం జారీ చేశారు. ఎందుకంటే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్ దిగేందుకు ఇదే అనువైన స్థలం.. మీరు ఎట్టి పరిస్థితుల్లో వడ్లను ఉన్నఫలంగా తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
Telangana News:నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది హుజూర్‌నగర్ సొంత నియోజకవర్గం. ఉగాది పర్వదినం సందర్భంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని హుజూర్‌నగర్‌లో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవనున్నారు. దీంతో ఉత్తమ్ గత రెండు మూడు రోజులుగా నియోజకవర్గంతో పాటు ఆయన సతీమణి నియోజకవర్గమైన పక్కనే ఉన్న కోదాడ నియోజకవర్గంలో చుట్టి వస్తున్నారు.
Telangana News:ఇదిలా ఉండగా, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా కొద్దిదూరానికే ప్రయాణిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న ఈ తరుణంలో, హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచర్ల పట్టణ పరిధిలో ఓ కల్లంలో ఆరబోసిన రైతుల వరి ధాన్యాన్ని తొలగించాలని అధికారులు, పోలీసులు రైతులపై ఒత్తిడి తేవడం బహిర్గతమైంది. వివిధ సోషల్ మీడియా వేదికల్లో ఈ వీడియోలు, ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
Telangana News:అధికారులు ఎంతగా ఒత్తిడి తెస్తున్నా, రైతులు ససేమిరా అంటున్న వైనం బయటకొచ్చింది. ఇప్పటికిప్పుడు ధాన్యం తొలగించాలంటే ఎలా? అంటూ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఒకరోజు ముందుగా చెప్పినా వేరేచోటకు తరలించేవాళ్లమని చెప్తున్నారు. అధికారుల ఎదుట తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. అధికారులు పంతానికి వెళ్తారా? మరోచోటును వెతుక్కుంటారా? అనేది వేచి చూద్దాం. దీనిపై నెటిజన్లు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రైతుల నోటికాడి వడ్లను ఉన్నట్టుండి తొలగించాలనడం సరికాదని పేర్కొంటున్నారు. హెలికాప్టర్‌ను మరోచోట దించుకోవచ్చని సూచిస్తన్నారు.