Telangana News:

Telangana News: కాంటా కావ‌డం లేద‌ని రైతు మ‌న‌స్తాపం.. ధాన్యం త‌గల‌బెట్టేందుకు విఫ‌ల‌య‌త్నం

Telangana News: కొనుగోలు కేంద్రంలో అమ్మ‌కానికి తెచ్చిన ధాన్యం కాంటాలు కాక‌పోవ‌డంతో ఓ రైతు మ‌న‌స్తాపం చెందాడు. ఒక‌రోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా 25 రోజులు అవుతున్నా కొనుగోళ్లు చేప‌ట్ట‌ని కార‌ణంగా తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాడు. మ‌రోవైపు అకాల‌వ‌ర్షాల‌తో ధాన్యం త‌డుస్తుండ‌గా, మ‌రోవైపు ఆరబెడుతూ కొనుగోలు కేంద్రంలోనే ఆ రైతు కుటుంబం ప‌డిగాపులు ఉండాల్సి వ‌స్తున్న‌ది. ఎన్ని రోజులు గ‌డిచినా కాంటాలు పెట్ట‌క‌పోవ‌డంతో ర‌గిలిపోయాడు.

Telangana News: మ‌హ‌బూబాబాద్ జిల్లా న‌ర్సింహుల‌పేట‌కు చెందిన రైతు అంకం రామ‌కృష్ణ త‌న పొలంలో పండిన 25 క్వింటాళ్ల వ‌రి ధాన్యాన్ని 25 రోజుల క్రితం స్థానికంగా ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మ‌కానికి తీసుకెళ్లాడు. రోజులు గ‌డుస్తున్నా రామ‌కృష్ణ ధాన్యం కాంటా పెట్టడం లేదు. కొనుగోలు కేంద్రం నిర్వాహ‌కుల‌ను రైతు ప‌లుమార్లు వేడుకున్నా ఫ‌లితం ద‌క్క‌లేదు.

Telangana News: రైతు అంకం రామ‌కృష్ణ ధాన్యం మాయిశ్చ‌ర్ వ‌చ్చి ఐదు రోజులు దాటినా కాంటా వేయ‌డం లేదు. కేంద్రం నిర్వాహ‌కులు పట్టించుకోవ‌డం లేదు. దీంతో మ‌న‌స్తాపం చెందిన రైతు రామ‌కృష్ణ ఓ క్యాన్‌లో పెట్రోల్ తెచ్చుకొని వ‌డ్ల‌ను త‌గుల‌బెట్టి, తాను ద‌హ‌న‌మ‌వుతాన‌ని చెప్పి విల‌పించ‌సాగాడు. ఈలోగా పెట్రోల్ పోసుకుంటుండగా, వెంట‌నే తోటి రైతులు రామ‌కృష్ణను వారించి పెట్రోల్ క్యాన్ ను ఆయ‌న చేతి నుంచి తీసుకొని, ఆయ‌న ప్రయ‌త్నాన్ని అడ్డుకున్నారు.

Telangana News: ఇది రైతు అంకం రామ‌కృష్ణ స‌మ‌స్య ఒక్క‌టే కాదు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంద‌రో రైతుల దుస్థితి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కాంటాలు కాక‌పోగా, మే 1, 2 తేదీల్లో కురిసిన అకాల వ‌ర్షాల‌కు ధాన్యం త‌డిసి ముద్ద‌యింది. కొన్నిచోట్ల వ‌ర‌ద ధాటికి వడ్లు కొట్టుకుపోయాయి. దీంతో ప‌లువురు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి వెంట‌నే ధాన్యం కొనుగోలు చేప‌ట్టాల‌ని ప‌లువురు రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *