Telangana News:విత్తనాలు వేసుకునే సమయంలో భూముల సర్వే ఏమిటి? మా ప్రాణాలు పోయినా భూమిలియ్యం.. అంటూ భూసేకరణ కోసం వచ్చిన అధికారులు రైతులు తేల్చి చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామ శివారులో ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూసేకరణలో భాగంగా పోలీసుల సహాయంతో అధికారులను రైతులు అడ్డుకున్నారు.
Telangana News:విత్తనాలు వేసే సమయంలో భూముల సర్వే చేయొద్దని రైతులు నిరసన వ్యక్తంచేశారు. ముందుగా ప్రాజెక్టు నిర్మాణం చేసే చోటు నుంచి సర్వే చేసుకుంటూ రావాలని డిమాండ్ చేశారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అదును దాటితే కాలం కాదని తెగేసి చెప్పారు. సర్వే పనులు చేయనివ్వకుండా రైతులు, వారి కుటుంబాలు కలిసి అడ్డుకున్నారు.

