Congress: ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలక సమావేశం జరిగింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశంపై ముఖ్య నేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన నేత కేసీ వేణుగోపాల్ అధ్యక్షత వహించగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధాన అంశాలపై సంప్రదింపులు కొనసాగాయి. ఉగాది పండుగకు ముందే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా మంత్రుల నియామకంపై చర్చ జరిగింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ మంత్రి పదవులను భర్తీ చేయాలని హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ విస్తరణలో మహిళలకు, యువతకు, మరియు పిన్న వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మున్ముందు రాజకీయంగా మరింత పటిష్ఠంగా నిలబడేందుకు ఈ విస్తరణ కీలకమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
