Telangana: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు నేతృత్వంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు శనివారం (నవంబర్ 1) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీనివాస్ నాయుడు తదితరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఇదే ప్రాంతానికి చెందిన టీటీడీపీ కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
