Telangana Jobs:నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందనున్నది. త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలకు నోటిఫికేషన్ రానున్నది. ఈ మేరకు తెలంగాణ సర్కారులో కసరత్తు జరుగుతున్నది. ఇప్పటికే ఖాళీలను గుర్తించిన పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కార్ నుంచి ఆదేశాలు అందగానే ఉద్యోగ నియామక ప్రక్రియను చేపడుతామని ఉన్నతాధికారులు తెలిపారు.
Telangana Jobs:రాష్ట్రంలో 2024లో పెద్ద ఎత్తున పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఎస్ఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తేల్చి మొత్తంగా 12 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
Telangana Jobs:గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ద్వారా వివిధ విభాగాల్లో 17 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ నియామక ప్రక్రియలో ఎంపికై, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి 2024లో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక నియామక పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి అధికారులు సిద్ధమవుతున్నారు.
Telangana Jobs:ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచారు. దీంతో ఆ పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 వరకు తమ ఉద్యోగాల్లో కొనసాగారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు వారి ఉద్యోగ విరమణలు కొనసాగాయి. వారి స్థానాల్లో ఏర్పడిన ఆయా ఖాళీలను భర్తీ చేయనున్నారు.