Telangana: ప్రపంచమంతా సాంకేతికత వైపు పరుగులు తీస్తున్న ఈ తరుణంలో.. మన పల్లెల్లో ఇంటర్నెట్ సదుపాయం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఊరూరా ఇంటర్నెట్ లింకింగ్ కోసం కేబుల్ కనెక్టివిటీ సౌకర్యం కల్పించారు. తాజాగా ఇప్పటి ప్రభుత్వం పల్లెలకు విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది.
Telangana: ఈ మేరకు తెలంగాణలోని మూడు జిల్లాల్లో తొలుత అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకూ నెట్ సౌకర్యం అమలు చేయనున్నారు. ఆ తర్వాత వరుసగా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తారు. దీంతో పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవమే రానున్నది.
Telangana: ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్, వర్చువల్ నెట్‌వర్క్, టెలిఫోన్, పలు ఓటీటీలను రూ.300కే చూసేలా సదుపాయాన్ని కల్పించేలా ప్రభుత్వం మదనం చేస్తున్నది. ఇది కనుక సఫలమైతే ప్రజలకు తక్కువ ధరకే నెట్ సదుపాయాన్ని పొందే అవకాశం దక్కుతున్నది. ఈ పథకాన్ని ప్రభుత్వ ప్రజా విజయోత్సవాలలో భాగంగా రేపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.