Telangana Inter Results: ఈ నెల (ఏప్రిల్) 22న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మేరకు తాజగా జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
Telangana Inter Results: గత మార్చి 5 నుంచి అదే నెల 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌లో 4,88,448 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ద్వితీయ సంవత్సరంలో 5,08,253 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల రెండోవారంలోనే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయింది. ఫలితాల వెల్లడి తర్వాత రివాల్యుయేషన్, రీ కౌంటింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఫలితాల అనంతరం నెలరోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.