TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన సుమారు 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రేపు, అంటే ఏప్రిల్ 12 (ఆదివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదే వేదికపై నుంచి వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్న ఇంటర్ ప్రథమ సంవత్సరం నూతన సిలబస్ పుస్తకాలను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.
ఫలితాల ముఖ్యాంశాలు:
-
పరీక్షల నిర్వహణ: ఫిబ్రవరి 28 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి.
-
మొత్తం విద్యార్థులు: రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 మంది విద్యార్థులు హాజరయ్యారు.
-
ఫస్టియర్: 4,89,126 మంది.
-
సెకండియర్: 5,07,949 మంది.
-
-
మూల్యాంకనం: సమాధాన పత్రాల దిద్దుబాటు ప్రక్రియ గత నెలాఖరులోనే పూర్తయింది. ముఖ్యంగా ఒకే ఒక్క సబ్జెక్టులో స్వల్ప మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థుల పేపర్లను బోర్డు మరోసారి రీ-వెరిఫికేషన్ చేసి, ఎక్కడా అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి (Step-by-Step):
ఫలితాల విడుదల తర్వాత ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి కింద సూచించిన పద్ధతిలో మీ మార్కులను వేగంగా తెలుసుకోవచ్చు:
-
అధికారిక వెబ్‌సైట్: ముందుగా https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
-
లింక్ ఎంపిక: హోమ్ పేజీలో కనిపించే ‘Inter Results 2026’ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
-
హాల్ టికెట్: మీ హాల్ టికెట్ నంబర్‌ను తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.
-
సబ్మిట్: సబ్మిట్ బటన్ నొక్కగానే మీ ఫలితం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
-
ప్రింట్: మీ మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
