Telangana

Hyderabad: తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ

Hyderabad: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో పలు కీలక శాఖల కార్యదర్శులతో పాటు, పలు జిల్లాల కలెక్టర్లకు కూడా స్థానచలనం కలిగింది. ప్రధానంగా ఫైనాన్స్, ఇరిగేషన్, పరిశ్రమల శాఖల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టం చేసింది.

తాజాగా బదిలీల ప్రకారం..

  • సంజయ్ కుమార్ ఇండస్ట్రీస్ నుంచి PR&RD శాఖకు బదిలీ

  • ఎన్. శ్రీధర్ IT&C ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం

  • సబ్యసాచీ ఘోష్‌కు ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & CSR బాధ్యతలు

  • ఎం. దానా కిషోర్‌కు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) అదనపు బాధ్యతలు

  • రాహుల్‌ బొజ్జా పొలిటికల్ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం

  • డా. గౌరవ్ ఉప్పల్ ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖకు బదిలీ

  • TGMSIDC మేనేజింగ్ డైరెక్టర్‌గా డా. గౌరవ్ ఉప్పల్‌కు అదనపు బాధ్యత

  • బి. విజయేంద్ర మహబూబ్‌నగర్ కలెక్టర్ బదిలీ

  • ఆద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ భవన్ (న్యూ ఢిల్లీ)కి పోస్టింగ్

  • యాదాద్రి కలెక్టర్ హనుమంతరావుకు ఎండౌమెంట్స్ డైరెక్టర్ బాధ్యతలు

  • సిక్తా పట్నాయక్ ఫైనాన్స్ శాఖకు స్పెషల్ సెక్రటరీగా నియామకం

  • పామెలా సత్పతి లేబర్ శాఖకు స్పెషల్ కమిషనర్‌గా బదిలీ

  • అనురాగ్ జయంతి యాదాద్రి కలెక్టర్‌గా నియామకం

  • మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సహకార శాఖకు స్పెషల్ కమిషనర్

  • గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి

  • హనుమకొండ కలెక్టర్‌గా బదిలీ

  • హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ ఎండీగా శివేంద్ర ప్రతాప్

  • యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి.
  • ప్రస్తుత కలెక్టర్ హనుమంతరావు గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్‌గా బదిలీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *