Telangana: తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకున్నది. పెద్దలు తమ వివాహాన్ని అంగీకరించరేమోనని ఎందరో యువతీ, యువకుల జంటలు ఓ వైపు ఆత్మహత్యలే శరణ్యమని తనువులు చాలిస్తుండగా, తమ పరువుకు భంగం కలిగిందని మరోవైపు తల్లిదండ్రులు ఏకంగా యువత ప్రాణాలనే బలితీసుకుంటున్నారు. ఇక్కడా అదే జరిగింది. తన కూతురుతో చనువుగా ఉంటున్నాడనే కారణంతో ఆ యువతి తండ్రి ఓ యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికిచంపిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకున్నది.
Telangana: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో ఆ యువతి తండ్రి వారి ప్రేమకు అడ్డుచెప్పాడు. ఇక నుంచి తన కూతురుతో తిరగవద్దని సాయికుమార్‌ను ఆ యువతి తండ్రి హెచ్చరికలు కూడా జారీ చేశాడు.
Telangana: అయినా వారు మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. ఈ దశలో ఆ విషయం తెలిసిన ఆ యువతి తండ్రిలో రాక్షసుడు బయటకొచ్చాడు. కసితో రగిలిపోయాడు. ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలనే నిర్ణయించుకున్నాడు. తన కూతురు నుంచి దూరం చేయాలని పన్నాగం పన్నాడు. దీంతో
Telangana: ఈ నేపథ్యంలో గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆ యువతి తండ్రి గొడ్డలి చేతబట్టి రానే వచ్చాడు. ఒక్కసారిగా సాయికుమార్‌పై గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో సాయికుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి.
Telangana: వెంటనే క్షతగాత్రుడిని అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే చనిపోయాడు. చూశారా? పరువు అనే పంకిలం ఓ మనిషి చావునే కళ్లారా చూసింది. ఓ మనిషిని మృగంలా తయారు చేసి క్షణికావేశంతో మరో మనిషి ప్రాణాన్ని తృణప్రాయంగా తీసింది.
మరో విచిత్రమేమింటే.. ఆ హత్య జరిగింది.. సాయికుమార్ పుట్టినరోజునాడే కావడం గమనార్హం. బర్త్‌డే జరుపుకున్న కొద్దిసేపటికే అతని తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

