TG High Court: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహణలో ఆలస్యం పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టమైన సమాచారం సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హై కోర్ట్.
ఈ ఏడాది మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పదవీకాలం ముగిసినా, ఇప్పటి వరకు ఎన్నికలు జరగకపోవడాన్ని సవాల్ చేస్తూ రాజేందర్ అనే రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది నరేశ్‌రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నికైన సభ్యులు లేకపోవడంతో ప్రజలు త్రీవ్ర సమస్యలు ఎదురుకోవలిసి వస్తుంది. గడువు ముగిసిన మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC)పై ఉంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు హై కోర్ట్ లో వాదించారు.
ఇది కూడా చదవండి: Crime News: మా చెల్లినే ప్రేమిస్తావా.. ప్రియుడి తల నరికేసి.. ముక్కలు ముక్కలు చేసిన ప్రియురాలి అన్న..
ఇక SEC తరఫున సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ మాట్లాడుతూ, “ఎన్నికల ప్రక్రియ చేపట్టడానికి కమిషన్ సిద్ధంగా ఉంది. అయితే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు వంటి కీలక వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాలి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బంది, ఇతర వనరులు సిద్ధం కావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.