Telangana Governer: ఎట్టకేలకు ఆ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇక గెజిట్ విడుదల చేయడమే తరువాయి. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యాసంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానున్నది. దీంతో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కనున్నది. ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు మోక్షం లభించింది.
Telangana Governer: ఎస్సీల్లోని మాదిగ, మాలలతో పాటు 57 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజిస్తూ రాష్ట్రప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ మేరకు రూపొందించిన ఎస్సీ వర్గీకరణ బిల్లును గత నెల 17న రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అదే నెల 18న శాసనసభలో, 19న శాసన మండలిలో ఆమోదం లభించింది. ఆ తర్వాత ఆ బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. ఇన్నాళ్లకు గవర్నర్ ఆమోదం దక్కింది.
Telangana Governer: ఎస్సీల్లోని అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్-1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288 శాతంగా ఉన్నది. వీరికి ఒక శాతం రిజర్వేషన్‌ను కేటాయించారు. మధ్యస్థంగా ఉన్న మరో 18 ఎస్సీ కులాలను గ్రూప్-2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.748 శాతంగా ఉండగా, 9శాతం రిజర్వేషన్ కల్పించారు. మరో 26 కులాలను గ్రూపు-3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి జనాభా 33.963 శాతంగా ఉండగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నివేదికలో పొందుపర్చారు.
Telangana Governer: గవర్నర్ ఆమోద ముద్ర తర్వాత ఇప్పటికే ప్రభుత్వం వద్దకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రతులు చేరినట్టు ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. ఈ బిల్లు అమలుపై నేడో, రేపో ప్రభుత్వం గెజిట్ విడుదల చేయనున్నది. ఆ తర్వాత రిజర్వేషన్ల వివరాలను అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఇదిలా ఉండగా, గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు బిల్లులను పంపగా, ఒక్క ఎస్సీ వర్గీకరణ బిల్లునే ఆమోదించడం గమనార్హం. ఇంకా గవర్నర్ వద్ద బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఆమోదిస్తారా? లేక ఏమైనా అభ్యంతరాలను వ్యక్తంచేస్తారా? అన్నది తేలాల్సి ఉన్నది.
Telangana Governer: తెలంగాణలో 30 ఏళ్లుగా సాగిన పోరాటానికి ఇప్పుడు ముగింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదానికి పంపిన కీలక బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో ఎస్సీ వర్గాల ప్రజలకు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ బిల్లుతో పాటు అనేక అభివృద్ధి, హక్కుల అంశాలకు న్యాయం జరగనున్నది. ప్రజా ఉద్యమాలు ఎంతటి మార్పు తీసుకురాగలవో ఈ సంఘటన మరొకసారి నిరూపించింది.