Telangana:తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందజేసింది. ఎప్పుడెప్పుడా అని మహిళలు చర్చించుకుంటున్న చీరల పంపిణీని ఆ రోజే చేయాలని సర్కారు నిర్ణయించింది. వాస్తవంగా బతుకమ్మ పండుగకు ఆ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అందరూ భావించారు. అప్పటికి చీరల తయారీ కాలేదు. దీంతో ఇందిరమ్మ పేరిట పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నందున ఆమె జయంతిని పురస్కరించుకొని పంపిణీ చేయాలని ప్రభుత్వ పెద్దలు భావించారని సమాచారం.
Telangana:ఈ మేరకు నవంబర్ 19వ తేదీన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు చీరల పంపిణీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పేరట ఉచిత చీరల పంపిణీని ప్రారంభించనున్నది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు ఉచిత చీరలను పంపిణీ చేయాలని ఇప్పటికే సర్కారు నిర్ణయించింది.
Telangana:వచ్చే నవంబర్ 15వ తేదీ నాటికే చీరల తయారీని పుర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చీరల సరఫరాను పూర్తిచేయాలని, అదే నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మంది మహిళలకు, సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తయారైన రూ.800 కోట్ల విలువైన చీరలను అందించనున్నారు.