Telangana: తన అనారోగ్యంపై మరణ వాంగ్మూలం అంటూ ఇటీవలే మాజీ డీఎస్పీ నళిని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు పెట్టి సంచలనానికి తెర తీశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల తనకు నిలువెల్లా గాయాలు అయ్యాయని ఆ పోస్టులో ఆవేదన వ్యక్తంచేశారు. ఆ నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాత వాసంలో ఉన్నానని, మహర్షి దయానందుని దయతో ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నానని చెప్పారు. అయితే తాజాగా ఆమె విడుదల చేసిన మరో లేఖ సంచలనంగా మారింది.
Telangana: వచ్చే నవమి నాటికి తన విషయంపై ప్రభుత్వం తేల్చాలని, తేలకపోతే సజీవ సమాధి అవుతానని ఆ లేఖలో నళిని పేర్కొన్నారు. తాను ప్రమాదకరమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధితో తీవ్రస్థాయిలో బాధపడుతున్నానని తెలిపారు. తాను ఈ స్థితికి రావడానికి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తనకు ఉద్యోగంలో ఉన్ననాడు రాష్ట్రపతి మెడల్ రాకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని ఆవేదన వ్యక్తంచేశారు.
Telangana: నేటి నా దుస్థితికి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి 21 నెలల క్రితం రాసిన లేఖపై స్పందించకపోవడం మరోకారణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది చాలా హేయనీయం అని పేర్కొన్నారు. ఆనాటి ఫైల్ క్లియర్ చేయడానికి ఇంతవరకు సమయం ఎందుకు పడుతుందో తనకు తెలియడం లేదని తెలిపారు. వారి ఉద్దేశం ఏమిటో తనకు తెలియడం లేదని, ఇది మరింత ఒత్తిడికి గురిచేస్తుందని, ఇది తన చావుకు కారణమవుతుందేమోనని ఆందోళన వ్యక్తంచేశారు.
Telangana: నా చెవులతో సీఎం రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్ వినాలని, లేకుంటే బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉన్నదని, ఇక మృత్యుముఖంలోకి నెట్టేసే స్థాయిలో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక ఈ ఎమోషన్స్‌ను మోయలేకపోతున్నానని, ఈ నొప్పులు భరించలేక తాను చనిపోతే బాగుండు అనిపిస్తుంది. నవమి నాటికి ఈ సమస్యను పరిష్కరించకపోతే తాను సజీవ సమాధి అవుతాను, తన స్నేహితులు తనను ఆనందంతో ఈలోకం నుంచి సాగనంపాలి.. అని ఆమె కోరుకుంటూ ఆలేఖలో పేర్కొన్నారు.