KCR Sister Dead:

KCR Sister Dead: కేసీఆర్ కుటుంబంలో విషాదం.. ఆయన సోదరి కన్నుమూత..!

KCR Sister Dead: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇల్లు శుక్రవారం రాత్రి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి చేరుకున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరుగుతాయని చెబుతున్నారు. సకలమ్మ మృతికి కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

మరోవైపు, కీలకమైన బీఆర్‌ఎస్ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర కీలక నాయకులను కలవాల్సి ఉంది. కేసీఆర్ సోదరి సకలమ్మ మరణం కారణంగా ఈ సమావేశం వాయిదా పడిందని చెబుతున్నారు. సకలమ్మ కేసీఆర్ ఐదవ సోదరి. ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలానికి చెందినవారు. సకలమ్మ భర్త హన్మంతరావు కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. సకలమ్మ, హన్మంతరావు దంపతులకు ముగ్గురు కుమారులు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *