తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే

తెలంగాణలోని ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.గ్రామ అభివృద్దికి ఇప్పటికే రూ.58కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో కొండారెడ్డిపల్లి రాష్ట్రంలోనే మొదటి సోలార్ విద్యుత్ గ్రామంగా చరిత్రకు ఎక్కనుంది.అందుకు సర్వం సిద్ధం చేశారు.

గ్రామ స్వరూపాన్ని మార్చేవిధంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఇవాళ సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్నారు. ఆయన అక్కడే దసరా పండుగ వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి పండుగ జరుపుకోనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *