Telangana:

Telangana: పంచాయ‌తీల్లో జాయింట్ చెక్‌ప‌వ‌ర్ కొన‌సాగింపు

Telangana: గ్రామ పంచాయ‌తీల్లో ఉప సర్పంచ్‌ల చెక్‌ప‌వ‌ర్ అంశంపై నిన్న ఒక్క‌రోజు గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. మూడు విడ‌తలుగా పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. 12వేల‌కు పైగా పంచాయ‌తీల్లో పాల‌క‌వ‌ర్గాలు డిసెంబ‌ర్ 22న‌ కొలువుదీరాయి. ఒక‌రోజు త‌ర్వాత చెక్‌ప‌వ‌ర్ అంశంపై పంచాయ‌తీరాజ్ శాఖ జారీ చేసిన ఓ ఉత్త‌ర్వుతో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. ఆ త‌ర్వాత అదే శాఖ అధికారులు నాలుక్క‌రుచుకొని మ‌రోజీవోను జారీ చేయ‌డంతో గంద‌ర‌గోళానికి తెర‌ప‌డింది.

Telangana: డిసెంబ‌ర్ 23న మ‌ధ్యాహ్నం ఉప స‌ర్పంచ్‌ల చెక్‌ప‌వ‌ర్‌ను ర‌ద్దు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంచాయ‌తీల్లో ఆర్థిక లావాదేవీల విష‌యంలో స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచుల‌కు జాయింట్ చెక్ ప‌వ‌ర్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇది 2018 పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం ద్వారా సంక్ర‌మిస్తూ వ‌చ్చింది.

Telangana: తాజాగా తొలుత చెక్‌ప‌వ‌ర్ విషయంలో ఉప స‌ర్పంచ్‌ల ప్ర‌స్తావన లేక‌పోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. ఉప స‌ర్పంచ్‌ల చెక్‌ప‌వ‌ర్ ర‌ద్దు చేయ‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని తొలుత ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌రిచేస్తూ, పంచాయ‌తీల్లో ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్‌ప‌వ‌ర్ విధానాన్ని కొన‌సాగిస్తూ మ‌రో ఉత్త‌ర్వును జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *