Kaleshwaram Project: తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు సామా రామ్మోహన్ రెడ్డి, బీజేపీ పెద్దలకు పెద్ద సవాల్ విసిరారు. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై CBI విచారణ కోరిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఇప్పుడు తమ నిబద్ధతను నిరూపించుకోవాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై పూర్తి పారదర్శకతతో కూడిన విచారణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆధారాలతో కూడిన నివేదిక సమర్పించారని సామా తెలిపారు. అంతేకాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును CBI కి అప్పగిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని ఆయన చెప్పారు.
ఇప్పుడు, బీజేపీ నాయకులు చొరవ తీసుకుని ఈ కేసుపై త్వరగా చర్యలు చేపట్టాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని సామా రామ్మోహన్ రెడ్డి కోరారు. ఈ డిమాండ్ ద్వారా BRS, బీజేపీ మధ్య నిజంగానే స్నేహబంధం ఉంది అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించే అవకాశం బీజేపీకి వచ్చిందన్నారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు ఇక్కడ బీజేపీ నాయకులు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమకు.. బీఆర్ఎస్ కు మధ్య రహస్య సంబంధాలున్నాయనే ప్రచారాన్ని తప్పు అని నిరూపించాలని సామా రామ్మోహన్ రెడ్డి తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు.
ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ CBI కి ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేసిన కేంద్ర మంత్రులు @kishanreddybjp , @bandisanjay_bjp , BJP రాష్ట్ర అధ్యక్షుడు @N_RamchanderRao లు… ఇప్పుడు ముఖ్యమంత్రి @revanth_anumula గారు విచారణ మరింత పారదర్శకత కోసం అసెంబ్లీ లో ఆధారాలతో… pic.twitter.com/v9V0MQG1n0
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) September 1, 2025