Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 23, 24 తేదీల్లో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అగ్రనేతలతో కీలక చర్చల నిమిత్తం ఆయన పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో క్యాబినెట్ విస్తరణపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి.
ఇప్పటికే మంత్రిత్వ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు, ఆశావహులు వరుసగా సీఎం రేవంత్‌ను కలుస్తుండటం గమనార్హం. ఈనెలాఖరున క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఖాళీగా ఉన్న శాఖలు, మంత్రుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు విడతలుగా మంత్రివర్గాన్ని విస్తరించినా, ఇంకా పలు ముఖ్యమైన నేతలకు అవకాశం రాలేదన్న ఆవేదన ఉంది. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటన అనంతరం ఈ విషయంపై స్పష్టత రావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

