Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ కులగణన, రిజర్వేషన్లు, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల మంజూరు వంటి విషయాలను ప్రధానితో ప్రస్తావించనున్నారు. అలాగే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం గురించి పూర్తి వివరాలతో ప్రధానికి నివేదించనున్నారు. ఇటీవల జరిగిన ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ ఫోన్‌లో మోడీతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ రావడంతో మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. గత ఏడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్, దాదాపు 6 నెలల అనంతరం మళ్లీ సమావేశం అవుతున్నారు. ఈరోజు సమావేశంలో మూసీ నది అభివృద్ధి, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డును వేగంగా పూర్తి చేసే అంశాలపై చర్చ జరగనుంది. అలాగే విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధానికి వివరించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్..46 రోజుల్లో 33 లక్షల కోట్లు నష్టం..