Telangana: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా కొందరు మంత్రులు, నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఇండోర్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి వెళ్లారు.
Telangana: సీఎం, డిప్యూటీ సీఎం సహా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్కతోపాటు కొందరు ఎంపీలు కూడా మధ్యప్రదేశ్ వెళ్లారు. ఇండోర్ జిల్లా మోవ్‌లో జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ కార్యక్రమం ఏఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖ్గేతో సహా ఏఐసీసీ కీలక నేతలు పాల్గొంటారు.
Telangana: అక్కడి మహూ కంటోన్మెంట్ ప్రాంతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం, ఆయన రాజ్యంగ రచనలో చేసిన పాత్రను గుర్తుచేసుకుంటూ భారీ ర్యాలీ జరుగుతుంది. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో ఏఐసీసీ అగ్రనేతలతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రసంగించనున్నారు.