telangana

Telangana: త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: సీఎం రేవంత్

Telangana: డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతూ యువత నిర్వీర్యం అవుతోందని సీఎం రేవంత్ అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నారు. ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరం. యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూస్తాం. నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటేనే యువతకు జాబ్స్ వస్తాయి. చదువులో నాణ్యత విషయంలోనూ కాలేజీలు దృష్టి పెట్టాలి. లేదంటే వాటి అనుమతి రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలి.

Also Read: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!

Telangana: కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్చుకోవడం లేదు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా నిరుద్యోగులు ఉన్నారని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. డీఎస్సీ, గ్రూప్స్‌ విభాగాల్లో మరో 35వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం. త్వరలో మరో 35వేల పోస్టులు భర్తీ చేస్తాం. ఎంత చదువుకున్నా నాలెడ్జ్‌, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇక ప్రైవేటు సెక్టార్‌లో ఇండస్ట్రీ పెద్దలను పిలిచి వారి అవసరాలు తెలుసుకున్నాం. అందుకు అనుగుణంగా అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. కాగా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్కిల్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *