TS 10th Class Results 2025

TS 10th Class Results 2025: నేడు తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

TS 10th Class Results 2025: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల ఎదురుచూపులు తీరనున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు రవీంద్ర భారతి వేదికగా ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఈ ఏడాది మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 18న ప్రారంభమై ఏప్రిల్ 4తో పరీక్షలు ముగిశాయి. మొత్తం 2,650 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, 19 మూల్యాంకన కేంద్రాల్లో అప్రమత్తతతో పత్రాలను పరిశీలించారు. ఏప్రిల్ 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ 15వ తేదీ నాటికి పూర్తయ్యింది.

ఇది కూడా చదవండి: Narendra Modi: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ కీలక భేటీ..

గతంలో వాడిన జీపీఏ విధానాన్ని ఈసారి తొలగించారు. అందువల్ల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లు కాకుండా తేలికైన అర్థమయ్యే విధంగా మార్కులు ఇవ్వనున్నారు. కనీస అంకాలు రాకపోతే మెమోలో స్పష్టంగా ఫెయిల్డ్ అని నమోదు చేస్తారు.

విద్యార్థులు తమ ఫలితాలను https://bse.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పరిశీలించవచ్చు. హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అవసరమైతే ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు విడుదలైన అనంతరం, సప్లిమెంటరీ పరీక్షల తేదీలతో పాటు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్ ప్రక్రియలపై పూర్తి సమాచారం విడుదల కానుంది. దీనికి అనుగుణంగా విద్యార్థులు సంబంధిత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *