Telangana:హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం (అక్టోబర్ 15) బీజేపీ, బీసీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ వివాదం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సమక్షంలోనే జరగడం గమనార్హం. వారిద్దరూ వారించినా ఘర్షణ సద్దుమణగలేదు.
Telangana:అక్టోబర్ 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరేందుకు బుధవారం బీసీ సంఘాల నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య సహా ఇతర బీసీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో ఫొటోల విషయంలో బీసీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకన్నది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఆర్ కృష్ణయ్య, రామచంద్రరావు వారించినా వారు వినలేదు. ఆ తర్వాత కూడా తీవ్ర దూషణకు దిగారు.
