CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున పాల్గొనేందుకు ఆయన ముంబై చేరుకున్నారు. నగరంలోని మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో తొలుత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్ సుక్కు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా, పీసీసీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు.
CM Revanth Reddy: అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన పథకాల గురించి అక్కడి నేతలకు వివరించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, చేపట్టిన పథకాల అమలు గురించి వివరించారు.
