Cabinet Meeting

Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

Cabinet Meeting:  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు అత్యంత కీలకమైన రోజు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు, బనకచర్ల నీటి వివాదం సహా అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి:
తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, నేటి సమావేశంలో ఎన్నికల సన్నాహాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మొదట నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశం ఉందని సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నందున, ఈ అంశంపై కూడా లోతుగా చర్చించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చాకనే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది.

Also Read: Bandi Sanjay: కట్టర్‌ సమూహమే కాదు, బడి పిల్లలూ ఆయన సైన్యమే!

ఆరు గ్యారెంటీల అమలుపై సమీక్ష:
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉంది. రైతు భరోసా, ఇందిరమ్మ గృహ నిర్మాణం వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ పథకాల అమలులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

గత నిర్ణయాల అమలుపై ‘స్టేటస్ రిపోర్ట్’:
ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు జరిగిన 18 మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న 327 నిర్ణయాలపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ను ఈ భేటీలో సమర్పించి చర్చించే అవకాశాలున్నాయి. గత సమావేశంలో ప్రతి మూడు నెలలకోసారి క్యాబినెట్ సమావేశాన్ని ‘స్టేటస్ రిపోర్ట్ మీటింగ్’గా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమలుకాని లేదా ఆలస్యమైన నిర్ణయాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే దిశగా చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రుల నుంచి అధికారుల వరకు ఎక్కడ సమస్యలున్నాయో గుర్తించి, వాటిపై పూర్తి సమీక్ష జరగనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *