Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం…బీసీ రిజర్వేషన్‎పై చర్చ

Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్‌ సమావేశం నేడు జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

బీసీ రిజర్వేషన్లు – ప్రధాన అజెండా

  • వెనుకబడిన తరగతులకు (BC) 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశంపై కేబినెట్‌ సమగ్ర చర్చ జరగనుంది.

  • స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • జూన్ 25న హైకోర్టు ఇచ్చిన గడువులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Rate Today: చల్ల రోజుల తర్వాత తగ్గుతున్న బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

స్థానిక సంస్థల ఎన్నికలు

  • కేబినెట్‌ ఆమోదం తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి షెడ్యూల్‌ విడుదల చేయనుంది.

  • ఈ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాల సమీక్ష

కేబినెట్‌ సమావేశంలో పలు సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు:

  • మహిళలకు ఉచిత బస్సు సర్వీసు

  • సన్నకారు బియ్యం పంపిణీ

  • ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం

  • రైతు భరోసా

  • అర్హుల ఎంపిక, సర్టిఫికెట్ల పంపిణీ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో సమీక్షించాలని మంత్రులను ఆదేశించే అవకాశం ఉంది.

ఇంకా చర్చించే అంశాలు

  1. మెట్రో రైలు దశ-II విస్తరణ – హైదరాబాద్‌లో మెట్రో ప్రాజెక్ట్‌ విస్తరణపై వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR)పై చర్చ.

  2. గిగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బిల్లు – గిగ్‌ వర్కర్లకు సంక్షేమ పథకాలు.

  3. గో సంరక్షణ పాలసీ – గోశాల పాలసీపై తుది నిర్ణయం.

  4. ప్రైవేట్‌ క్యాబ్‌ సేవలు – ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలా అనే అంశంపై చర్చ.

  5. కులగణన, రేషన్‌ కార్డులు – కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, కులగణన నివేదిక.

  6. సాగునీటి ప్రాజెక్టులు – కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు.

  7. విద్యా శాఖ – కొత్త ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరు.

  8. మత్స్యకార సంఘాలు – మత్స్యకార సహకార సంఘాల ఇన్‌ఛార్జ్‌ల నియామకం.


తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *