ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేయడాన్నికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుతం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ హామీ అమలు కోసం ఆమోదం తెలిపింది. ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఎన్నికల సమయంలో ఈ హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు దానిని ఆచరణలోకి తీసుకురావడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక ఇదే క్యాబినెట్ మీటింగ్ లో పలు అంశాలపై ఆమోదం లభించింది. ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్వర్యంలో 12 మందితో రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను రెండేండ్లలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా కొత్తగా అనుమతులు ఇచ్చిన రాష్ట్రంలోని 8 మెడికల్ కాలేజీలకు 3 వేల బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ క్యాబినెట్.