Telangana Budget: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3,04,965 కోట్ల పద్దును తొలుత శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ పద్దులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత శాసనసభను వాయిదా వేశారు. శాసనసభలో భటి విక్రమార్క సుమారు 45 నిమిషాలపాటు బడ్జెట్ పద్దును చదవి వినిపించారు.
Telangana Budget: గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ అన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ ప్రతి చర్యను విమర్శిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్రం తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని విమర్శించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు ఈ కింది విధంగా ఉన్నాయి.
శాఖలు నిధులు (కోట్ల రూ.ల్లో)
రెవెన్యూ వ్యయం – 2,26,982
మూలధన వ్యయం – 36,504
వ్యవసాయ – 24,439
నీటిపారుదల – 23,373
విద్యాశాఖ – 23,208
పంచాయతీరాజ్ – 31,605
విద్యుత్తు – 21,221
మున్సిపల్ – 17,677
ఆరోగ్య – 12,393
పౌరసరఫరాలు – 5,734
బీసీ సంక్షేమం – 11,405
రోడ్లు భవనాలు 5,907
గిరిజన సంక్షేమం – 17,169
పరిశ్రమలు – 3,527
మైనార్టీ వ్యవహారాలు – 3,591
స్త్రీ, శిశు సంక్షేమం – 2,862
పర్యవారణ, అటవీశాఖ – 1,023
పశు సంవతర్థకం – 1,674
ఐటీ – 774
క్రీడలు – 465
చేనేత రంగం- 371
ఐటీ – 774