Telangana assembly:

Telangana assembly: మార్చి 12 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు షురూ.. ఆ రోజే బ‌డ్జెట్‌

Telangana assembly: తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈ నెల (మార్చి) 12 నుంచి ప్రారంభంకానున్నాయి. 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌తోపాటు కొన్ని కీల‌క బిల్ల‌లును ఈ స‌మావేశాల్లోనే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. ఈ మేర‌కు ఏర్పాట్లు కూడా జ‌రిగాయి. 42 బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లును ఈ స‌భ‌లోనే ప్ర‌వేశ‌పెట్టి ఆమోదం పొంద‌నున్నారు. తొలిరోజైన బుధ‌వారం ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై మ‌రుస‌టి రోజైనా మార్చి 13న ధ‌న్య‌వాద తీర్మానం ఉంటుంది.

Telangana assembly: మార్చి 14న హోలీ కావ‌డంతో స‌భ జ‌ర‌గ‌దు. ధ‌న్య‌వాత తీర్మానంపై చ‌ర్చ కౌన్సిల్‌లో పూర్తికాక‌పోతే 15న కూడా దానిపై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. ఆ త‌ర్వాత 17న ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లుపై, 18న బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లులపై అసెంబ్లీలో చర్చకు పెడ‌తారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉన్న‌ది. బీఏసీ స‌మావేశం నిర్వ‌హించిన త‌ర్వాత స‌భ నిర్వ‌హించే రోజుల‌పై ఒక క్లారిటీ వ‌స్తుంది.

Telangana assembly: మార్చి 17 లేదా 19వ తేదీన రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ త‌ర్వాత ప‌ద్దుల‌పై స‌భ‌లో చర్చించ‌నున్నారు. నెలాఖ‌రు వ‌ర‌కు బ‌డ్జెట్ స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని తెలుస్తున్న‌ది. ఒక‌వేళ 17న రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడితే బీసీ, ఎస్సీ రిజ‌ర్వేష‌న్ బిల్లుల‌ను ఆఖ‌రున ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉన్న‌ది.

Telangana assembly: ఈ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ఒక ప్ర‌త్యేకత ఉన్న‌ది. ప‌దేండ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించి, ఈ ఏడాది తొలినాళ్ల‌లో ఒక్క‌సారి మాత్ర‌మే వ‌చ్చి వెళ్లిన కేసీఆర్ ఈ స‌భ‌ల‌కు హాజ‌రుకానున్నారు. ప‌లుద‌ఫాలుగా కేసీఆర్ స‌భ‌కు రావాలంటూ సీఎం, ఇత‌ర మంత్రులు, అధికార పార్టీ స‌భ్యులు డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. ఈ ద‌శ‌లో కేసీఆర్ స‌భ‌కు హాజ‌రు కావాలంటూ హైకోర్టులో కేసు కూడా న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ స‌భ‌కు హాజ‌ర‌వుతుండ‌టంతో ఈ స‌భ‌ల‌కు ప్ర‌త్యేకత నెల‌కొన్న‌ది.

Telangana assembly: ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ ఈ స‌భ‌ల‌కు హాజ‌రవుతుండ‌టంతో ఈ బ‌డ్జెట్ స‌మావేశాలు వాడీవేడిగా జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. రాష్ట్రంలో నెల‌కొన్న సాగునీటి స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేవ‌నెత్తే అవ‌కాశం ఉన్న‌ది. దాంతోపాటు తాగునీరు, రుణ‌మాఫీ, రైతుభ‌రోసా, గురుకులాలు, గ్యారెంటీల అమ‌లు విష‌యాల‌పై అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్నాయి.

Telangana assembly: ఇదే ద‌శ‌లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తోపాటు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ బిల్లుల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క్ప‌లించేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక ప్లాన్ ప్ర‌కారం ముందుకు వెళ్తున్న‌ది. గ‌తంలో బీసీలు, ఎస్సీల‌కు బీఆర్ఎస్ స‌ర్కార్‌ ఏంచేసింద‌నే అంశాల‌ను అధికార ప‌క్షం లేవనెత్తి ఎండ‌గ‌ట్ట‌నుంద‌ని స‌మాచారం. అదే విధంగా ఆయా బిల్లుల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వం ఆమోదించేలా బీజేపీని కాంగ్రెస్ కార్న‌ర్ చేయాల‌నే ప్లాన్‌లో ఉన్న‌ది.

ALSO READ  KTR: తెలంగాణలో కాంగ్రెస్ పాలన కరవును తెచ్చింది..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *