Telangana assembly: డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలకాంశాలను లేవనెత్తారు. అన్నిపార్టీలను సంప్రదించాకే డీలిమిటేషన్ చేపట్టాలని ఆయన కోరారు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాదని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఆయన కోరారు.
Telangana assembly: జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపం కాకూడదని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకున్నారు. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, ఎక్కువ సీట్లను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లనే కొనసాగించాలని, అసెంబ్లీ సీట్లను తెలంగాణలో 153కు పెంచాలని సూచించారు.
Telangana assembly: 2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని అనుకోవడం చర్చనీయాంశంగా మారింది. 1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాలను పెద్ద ఎత్తున చేపట్టాయి. కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదు. డీలిమిటేషన్ అనేది సౌత్‌కే పరిమితం చేసే ప్రమాదం ఏర్పడింది.