Telangana assembly: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. తొలి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. మరుసటిరోజైన గురువారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని అధికార పక్షం ప్రవేశపెట్టింది. దీనిపై బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడుతుండగా, స్పీకర్‌పై అమర్యాదగా మాట్లాడారంటూ ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. తాను నిబంధనలను అతిక్రమించలేదని, అమర్యాదగా మాట్లాడలేదని చెప్పేందుకు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ పేర్కొంటున్నది.
Telangana assembly: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపైనే శనివారం (మార్చి 15) కూడా చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్ తరఫున జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సమయంలో ఆయన పలు అంశాలను లేవనెత్తారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ మొన్న అరెస్టు చేసిన మహిళా జర్నలిస్టులను విడుదల చేయాలని కోరారు.
Telangana assembly: ఈ దశలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలుగజేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు విపరీతంగా అభివృద్ధి చేస్తున్నారు, అన్ని హామీలు అమలు చేస్తున్నారు, కానీ, ప్రచారం చేసుకోవడం లేదు అని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. సరిగ్గా ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్ కు తిరుగే ఉండదని చాలామంది ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీ చేశామని చెప్పారు.
Telangana assembly: ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఓ సవాల్ విసిరారు. తన జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఏదైనా ఒక గ్రామాన్ని ఎంచుకుందామని, ఆ గ్రామంలో నూరుశాతం రైతులకు రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే తాను అక్కడే ముక్కు నేలకు రాస్తానని, రాజీనామా చేసి వస్తానని చాలెంజ్ విసిరారు. ఇదే నియోజకవర్గం కాదు.. భట్టి నియోజకవర్గమైనా, మరేదైనా నియోజకవర్గంలో 100 శాతం అమలు అయితే ముక్కు నేలకు రాస్తా.. అని చాలెంజ్ విసిరారు.
Telangana assembly: కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 564 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలను నివారించేందుకు కాంగ్రెస్ సర్కార్ చొరవ తీసుకోవాలని, ఎండుతున్న పంటలను కాపాడాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో 2014కు ముందు 1400 మంది రైతు ఆత్మహత్యలు ఉంటే, ఆ తర్వాత తమ బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆత్మహత్యలను నివారించామని చెప్పారు. మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.