Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ మొదలు నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. అనంతరం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అప్పుల వివరాలను సభలో ప్రకటించారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని వెల్లడించారు. అయితే భట్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది పూర్తిగా అవాస్తవని ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తూ.. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు 51 వేల 200 కోట్లు అని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు మాట్లాడటం లేదు.. అప్పులపై ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. హరీష్ రావు సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమల దర్శనాల కోసం ఏకంగా హోమ్ మంత్రినే వాడేశాడు.. చివరికి ఏమైందంటే..
Telangana Assembly: అప్పులపై చర్చ జరగాలనే అధికారంలోకి రాగానే అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమని.. బీఆర్ఎస్ రెడీనా..? అని సవాల్ విసిరారు భట్టి. నిండు సభ సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు.. మీరా ప్రివిలైజ్ మోషన్ ఇచ్చిందని భట్టి సీరియస్ అయ్యారు. దీంతో రాష్ట్ర అప్పులపై భట్టి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది.