Telangana assembly Elections: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎప్పటి నుంచే ప్రక్రియ చేపట్టిన జమిలి ఎన్నికలు తరుముకొస్తున్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఏడాది గడువుకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయా? దీనికోసం కసరత్తు మొదలైందా? త్వరలో జరగనున్న స్థానిక సంస్థల కాలపరిమితి కూడా కుదించుకోనున్నదా? అంటే అవుననే అంచనాలు కనిపిస్తున్నాయి.
Telangana assembly Elections: భారతదేశం మొత్తం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందజేసింది. దానికి సంబంధించి రాజకీయ, న్యాయ, ఆర్థిక నిపుణులతో ఆ కమిటీ చర్చించి, సాధ్యాసాధ్యాలపై తన నివేదికలో పొందుపర్చింది.
Telangana assembly Elections: జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో ఐదు ఆర్థికల్స్‌ను సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83, 85, 172, 174, 356ను రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సవరించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచించింది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే అటు లోక్‌సభలో, ఇటు రాజ్యసభలో 67 శాతం మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా దేశంలోని 14 రాష్ట్రాల అసెంబ్లీలలో మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని ఆ కమిటీ సూచించింది. పార్లమెంట్, అసెంబ్లీలలో మద్దతు వస్తేనే రాజ్యాంగ పరిధిలోకి వస్తుందని నివేదించింది.
Telangana assembly Elections: జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు లభిస్తే వచ్చే 2027 ఫిబ్రవరిలోనే ఎన్నికలను నిర్వహించాలని ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించాలని ఒక అంచనాతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది.
Telangana assembly Elections: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అన్ని అసెంబ్లీల ఎన్నికల జరిగిన 100 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నది. దేశమంతా పరిపాలనా సౌలభ్య కోసమే ఈ జమిలి ఎన్నికలు జరపనున్నట్టు కేంద్రప్రభుత్వం చెప్తున్నది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరపాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది.
Telangana assembly Elections: ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగాయి. ఈ మేరకు మళ్లీ 2028లో జరగాల్సి ఉన్నది. అయితే జమిలి ఎన్నికల్లో భాగంగా 2027 ఫిబ్రవరిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో 10 నెలల గడువు ఉండగానే, రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. అదే విధంగా జూలై, లేదా ఆగస్టులో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే, సగం గడువు పూర్తికాకుండానే మళ్లీ నిర్వహిస్తారా? లేక ఐదేండ్లు పూర్తయ్యాక నిర్వహిస్తారో వేచి చూడాలి మరి.