Telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడింది. సభ్యుల పరస్పర ఆరోపణలతో అట్టుడికిపోయింది. హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. హరీశ్‌రావు మాట్లాడుతూ కొందరు సభ్యులు మద్యం తాగి సభకు వస్తున్నారని, డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేయాలని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
Telangana assembly: హరీశ్‌రావు వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యుల ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లింది. ఫాంహౌజ్‌లో తాగి పడుకున్నదెవరు? విమానం నుంచి దిగుతూ తాగి పడిపోయింది ఎవరు? అని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లను దండుకున్నది ఎవరు? కమీషన్లను వసూలు చేసింది నువ్వు కాదా? అని హరీశ్‌రావును ప్రశ్నించారు. దీంతో గందరగోళం నెలకొన్నది.