Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ని ర్ణయం తీసుకున్నది. రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నది. ఇప్పటికే జూన్, జూలై, ఆగస్టు నెలలకు గాను మూడు నెలల రేషన్‌ను ఒక్కసారే జూన్ నెలలోనే ఇచ్చింది. వచ్చే సెప్టెంబర్ నెలలో తిరిగి రేషన్ పంపిణీని ప్రారంభించనున్నది. ఆ నెల నుంచి రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ కోసం ప్రత్యేక సంచులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
Telangana: రేషన్ సంచితో పాటు సన్నబియ్యం, ఇతర సంక్షేమ పథకాల వివరాలను ముద్రించారు. ఇప్పటికే ఆయా బ్యాగులు రాష్ట్రంలోని రేషన్ డిపోలకూ చేరాయని అధికారుల ద్వారా తెలుస్తున్నది. సెప్టెంబర్ నెల రేషన్ తీసుకునే వారికి బియ్యంతో పాటు ఆ సంచిని ఉచితంగా అందించనున్నారు. రూ.50 రూపాయల విలువైన బ్యాగులను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: రేషన్ సంచులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలతో పాటుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటో కూడా ఉంటుంది. ఆ సంచిపై ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను ముద్రించి ఉంచారు. మున్ముందు బియ్యంతో పాటు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన 9 నిత్యావసర సరుకులను కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.