Telangana:

Telangana: ఎస్సీ రుణాల‌కు యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం.. యూనిట్లు ఇవే.. ద‌ర‌ఖాస్తులు అప్ప‌టి నుంచే

Telangana: ఎస్సీ కార్పొరేష‌న్ కింద వ‌చ్చే అంటే 2026-27 ఆర్థిక సంవత్స‌రానికి యువ‌త‌కు ఆర్థిక రుణాలు ఇచ్చేందుకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం యాక్ష‌న్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వ‌ర‌కు రుణాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లకు అవ‌కాశం క‌ల్పించింది. వివిధ యూనిట్ల ప్రాతిప‌దిక‌న ఆర్థిక చేయూత అందించేందుకు ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుదల చేసింది. ఈ మేర‌కు ఏప్రిల్ 11 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం అవుతాయి. సుమారు 34 ర‌కాల యూనిట్ల‌కు రుణాల‌ను అందించ‌నున్న‌ట్టు పేర్కొన్న‌ది. ఆయా రుణాలు, వాటి విలువ‌ను కింది విధంగా పేర్కొన్న‌ది.

యూనిట్లు – లోన్‌ విలువ (రూ.ల్లో)
1) ప్యాసింజ‌ర్ ఆటో (4 వీల‌ర్‌) – 8 ల‌క్ష‌లు
2) ప్యాసింజ‌ర్ ఆటో (3 వీల‌ర్‌) – 3 ల‌క్ష‌లు
3) ఎల‌క్రిక్ బ్యాట‌రీ చార్జింగ్ యూనిట్ – 20 ల‌క్ష‌లు
4) ఎల‌క్ట్రిక్ ఆటో – 3 ల‌క్ష‌లు
5) ప్యాసింజ‌ర్ కార్ (4 వీల‌ర్‌) – 10 ల‌క్ష‌లు
6) గూడ్స్ ట్ర‌క్ త‌దిత‌ర యూనిట్లు – 10 ల‌క్ష‌లు
7) అగ్రిక‌ల్చ‌ర్ డ్రోన్ – 10 ల‌క్ష‌లు
8) ఫ్ల‌వ‌ర్ బొకే ఠ‌సాప్ 2.50 ల‌క్ష‌లు
9) వ‌ర్మీ కంపోస్టు – 2.50 ల‌క్ష‌లు
10) నెట్ సెంట‌ర్ – 2.70 లక్ష‌లు
11) ఎల్ఈడీ బ‌ల్ప్‌ల షాప్ – 2.80 ల‌క్ష‌లు
12) ఫ్లంబింగ్, ఎల‌క్ట్రిక‌ల్ షాప్ – 2.90 లక్ష‌లు
13) వాట‌ర్ బాటిల్ త‌యారీ – 2.90 ల‌క్ష‌లు
14) వాట‌ర్ రీసైక్లింగ్ – 2.95 ల‌క్ష‌లు
15) మొబైల్ రిపేరింగ్ షాప్ – 3.10 ల‌క్ష‌లు
16) సోప్ డిట‌ర్జెంట్ త‌యారీ – 3.20 ల‌క్ష‌లు
17) ఫిష్ ఫార్మింగ్ 3.50 లక్ష‌లు
18) కార్ వాష్ – 3.50 ల‌క్ష‌లు
19) బ్రిక్స్ మేకింగ్ – 3.50 ల‌క్ష‌లు
20) టూరిజం – 3.50 ల‌క్ష‌లు
21) బేక‌రి షాప్ – 3.60 ల‌క్ష‌లు
22) సిరి క‌ల్చ‌ర్ – 3.80 ల‌క్ష‌లు
23) వాట‌ర్ ఆర్వో ప్లాంట్ – 3.80 ల‌క్ష‌లు
24) వెల్డింగ్ ఫ్యాబ్రికేష‌న్ – 3.85 ల‌క్ష‌లు
25) సోలార్ ప్రొడ‌క్టింగ్ – 3.90 ల‌క్ష‌లు
26) జ్యూట్ బ్యాగ్ త‌యారీ – 3.90 ల‌క్ష‌లు
27) సోలార్ ప్యానెల్ – 3.95 ల‌క్ష‌లు
28) కొబ్బ‌రికాయ తోట – 4 ల‌క్ష‌లు
29) ఫొటో షాప్ – 4 ల‌క్ష‌లు
30) ఆయుర్వేదిక్ మెడిక‌ల్ షాప్ – 4 ల‌క్ష‌లు
31) జ‌న‌ర‌ల్ మెడిక‌ల్ షాప్ – 5 లక్ష‌లు
32) బ్యూటీ పార్ల‌ర్ – 5 ల‌క్ష‌లు
33) మెడిక‌ల్ ల్యాబ్ – 5 ల‌క్ష‌లు
34) ఈవీ బ్యాట‌రీ చార్జింగ్ స్టేష‌న్ – 20 ల‌క్ష‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *