Telangana: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా ఆధునిక హంగులతో రూపుదిద్దుకొన్నా అప్పుడప్పుడూ భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రానికే పాలనా కేంద్రంగా కొనసాగుతున్న ఈ కార్యాలయంలోకి ప్రవేశానికి అందరికీ ఉండదు. అనుమతితోనే లోనికి ప్రవేశం కల్పిస్తారు. మీడియాకు కూడా పరిమిత అనుమతే ఉంటుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా కార్యాలయంలో కలియదిరగడం కలకలం రేపింది.
Telangana: అనుమతి విషయంలో ఉన్న నిబంధనలను ఆసరా చేసుకున్న ఆ వ్యక్తి ఓ ఫేక్ ఐడీని సంపాదించాడు. అది అలాంటిలాంటి శాఖ ఐడీ కాదు. ఏకంగా రెవెన్యూ శాఖ ఉద్యోగిగా ఓ ఐడీని చేయించేశాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ కార్యాలయంలో తిరగసాగాడు. అసలైన ఉద్యోగి ఐడీని పోలిన ఫేక్ ఐడీని ఫొటోతో సహా సృష్టించాడు.
Telangana: వెంటనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అసలు ఆ నకిలీ ఐడీ ఎలా సంపాదించాడు? ఎవరు సహకరించారన్న విషయాలపైనా ఆరా తీశారు. నిందితుడు భాస్కర్‌రావుకు సహకరించిన ఓ డ్రైవర్ రవిని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరిపైనా కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం
సచివాలయంలో ఫేక్ ఐడీతో దొరికిన వ్యక్తి
రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్
నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్
రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ… pic.twitter.com/MtbXQUhlm3
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2025

