Telangana: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం మరో కీలక ఆదేశాలను జారీ చేసింది. ఫుడ్ పాయిజన్ ఘటనలతో నిత్యం ఎందరో విద్యార్థులు అస్వస్థతకు గురవగా, కొందరు విద్యార్థులు తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలిడిచారు. ఈ దశలో ఇప్పటికే పాఠశాలలు, గురుకులాల్లో కమిటీలు వేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. తాజాగా ప్రత్యేక నిబంధనలను జారీ చేసింది.
Telangana: గతంలో కుళ్లిన కూరగాయలు, కోడిగుడ్డు, పురుగులున్న బియ్యం, నీళ్ల చారు విద్యార్థులకు పెట్టేవారు. దీంతో ఎందరో ఇలాంటి భోజనం తిని కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికీ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. వీటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం భావించి ఈ కింది నిబంధనలను జారీ చేసింది.
Telangana: గురుకులాలు, పాఠశాలల్లో వంటలు వండిన వెంటనే ప్రిన్సిపాల్, మెస్ ఇన్‌చార్జి తప్పకుండా రుచి చూడాలి. విద్యార్థులకు భోజనం వేడివేడిగా ఉన్నప్పుడే వడ్డించాలి. సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ తప్పకుండా ధరించాలి. రెండు పూటల కోసం పప్పును ఒకేసారి వండకూడదు. ఏ పూటకు ఆ పూటే వండాలి. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాటిని వాడొద్దు.. అంటూ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను జారీ చేసింది.