Hyderabad: తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. ఈ సంవత్సరం మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78గా నమోదైంది. ఇది గత ఏడాది కంటే 1.47 శాతం అధికం కావడం గమనార్హం.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ విద్యార్థులు ప్రతిభను చాటుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని తెలిపారు.
పరీక్షలు రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.