Telangana:తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఆర్.లింబాద్రి స్థానంలో ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి న్యాయ కళాశాలల్లో విశేష సేవలందించారు. ఇటిక్యాల పురుషోత్తం ఉస్మానియా వర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు.
Telangana:ప్రస్తుతం ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న ఆర్ లింబాద్రి 2021 ఆగస్టు 24వ తేదీన ఉన్నత విద్యామండలి అఫీషియేట్ చైర్మన్‌గా తాత్కాలిక హోదాలో నియమితులయ్యారు. 2021 నుంచి 2023 వరకు ఆయన సేవలను పరిగణనలోకి తీసుకున్న నాటి బీఆరెస్ ప్రభుత్వం 2023 జూన్‌లో పూర్తిస్థాయి చైర్మన్ హోదాను కట్టబెట్టింది. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన అదే ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందారు.