Tejeswar Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాల్‌లో తేజేశ్వర్ హత్య కేసులో మరో కీలక విషయం తాజాగా వెల్లడైంది. పోలీసుల విచారణలో వెల్లడైన ఈ విషయాన్ని విచారణాధికారి సీఐ శ్రీను బయటపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ప్రియుడు, బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమలరావు వాయిస్ చేంజర్ డివైజ్‌ను వాడినట్టు ఆధారం బయటకొచ్చింది.
Tejeswar Murder Case: గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్‌ను అతని భార్య ఐశ్వర్య పెళ్లయిన కొన్నాళ్లకే తన ప్రియుడు తిరులమరావుతో కలిసి సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడిన దారుణంగా చంపించారు. తిరుమలరావు, ఐశ్వర్య ఒక్కటి కావాలన్న కుట్రతోనే తన భర్త తేజేశ్వర్‌ను హతమార్చినట్టు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. అయితే విచారణ సమయంలో మరో రెండు కీలక అంశాలు బయటకొచ్చాయి.
Tejeswar Murder Case: ఐశ్వర్యతో తిరుమలరావుకు ఐదేండ్లుగా వివాహేతర బంధం కొనసాగుతున్నట్టు తేలింది. ఐశ్వర్యకు వివాహం కాకముందే రెండో భార్యగా పెళ్లి చేసుకునేందుకు తిరుమలరావు సిద్ధమయ్యాడు. అయితే అందుకు తిరుమలరావు భార్య ఓప్పుకోలేదు. దీంతో ప్లాన్ ప్రకారం ఐశ్వర్యకు తేజేశ్వర్‌తో వివాహానికి ఒప్పుకున్నారు. అతన్ని అంతమొందించి మరో కాపురం పెట్టేందుకు సిద్ధపడ్డారు.
Tejeswar Murder Case: ఈ సమయంలో ఐశ్వర్యతో మాట్లాడేందుకు నిందితుడు తిరుమలరావు వాయిస్ చేంజర్ డివైజ్‌ను వాడాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఐశ్వర్యతో ఒక అమ్మాయిలా మాట్లాడేందుకు తిరుమలరావు ఈ వాయిస్ చేంజర్ డివైజ్‌ను ఉపయోగించాడు. ఈ వాయిస్ చేంజర్ డివైజ్‌లో మాట్లాడుతూనే తేజేశ్వర్‌ణు చంపేందుకు తిరుమలరావు పథకం రచించాడు. సుపారీ గ్యాంగ్‌తో తేజేశ్వర్‌ను అంతమోందించాడు.
Tejeswar Murder Case: మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తేజేశ్వర్ చనిపోయిన సమయంలో కళ్లలో కన్నీరులా రావడానికి అతని భార్య ఐశ్వర్య గ్లిజరిన్ పోసుకున్నది. ఇటీవల ఐశ్వర్య గదిలో ఆ గ్లిజరిన్ సీసాను తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రధాన నిందితులను కోర్టు రిమాండ్ అనంతరం నాలుగు రోజులు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేశ్, ఏ4 పరుశరావు, ఏ5 రాజును విచారించడంతో ఈ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.