Teja Sajja: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా మరోసారి సినీప్రియులను షాక్ కి గురిచేశాడు. తన రాబోయే చిత్రం మిరాయ్ ట్రైలర్‌తో ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన తేజ, ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్‌లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడా? అనే ప్రశ్నకు నెట్టింట హల్చల్ చేస్తుంది.
సెప్టెంబర్ 12, 2025న విడుదలకు సిద్ధమవుతున్న మిరాయ్.. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తేజ కెరీర్‌లో కీలక మలుపు కాబోతుందని పరిశ్రమ వర్గాల అంచనా వేస్తుంది. అయితే, సినిమా ట్రైలర్ కంటే ఎక్కువ దృష్టి ఆకర్షించినది తేజ తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.
తాజాగా నిర్మాత స్వప్న దత్ చలసానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తేజ, తన పోస్ట్‌ను “కెలో కలుద్దాం” అనే లైన్‌తో ముగించాడు. ఈ ఒక్క లైన్ సోషల్ మీడియాలో ఊహాగానాలకు తావిచ్చింది. “కె” అంటే ప్రాజెక్ట్ K అని గుర్తుచేసుకున్న అభిమానులు, తేజ కల్కి సీక్వెల్‌లో నటిస్తున్నాడని నమ్ముతున్నారు.
ఇది కూడా చదవండి: AA22xA6 vs SSMB29: బిగ్ ఫైట్!
ప్రాజెక్ట్ అధికారిక టైటిల్ ప్రకటించే ముందు ప్రాజెక్ట్ K అని పిలిచిన విషయం తెలిసిందే. అయితే, మరికొందరు ఇది పూర్తిగా వేరే సినిమా కావచ్చని అంటున్నారు. తేజ ఈ రహస్యాన్ని ఇంకా విప్పకపోవడంతో, ఫ్యాన్స్ ఉత్సుకతతో ఆయన తదుపరి అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, తేజ మరో హైపింగ్ ప్రాజెక్ట్‌ను కూడా అధికారికంగా ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జోంబీ రెడ్డి 2లో తేజ మళ్లీ నటించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరిలో విడుదల కానుంది.
ప్రస్తుతం మాత్రం తేజ మొత్తం ఫోకస్ మిరాయ్ పైనే పెట్టాడు. అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ కట్‌తో వచ్చిన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. ఈ చిత్రం తేజ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.