Teja Sajja: తేజ సజ్జా.. కమర్శియల్ సినిమాలకు భిన్నంగా ప్రత్యేక కథలతో ప్రేక్షకుల మనసు గెలుస్తున్న యంగ్ హీరో! ప్రస్తుతం ఆయన చేస్తున్న మిరాయ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు రేపుతోంది. టీజర్, ట్రైలర్‌లకు అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సినిమాతో తేజ భారీ హిట్ కొట్టడం ఖాయమని టాక్. ఈ నేపథ్యంలో, తన తదుపరి చిత్రాల కోసం కూడా జాగ్రత్తగా కథలు, దర్శకులను ఎంచుకుంటున్నాడు.
ఇటీవల కోలీవుడ్‌లో వైరల్‌గా మారిన వార్త ఏంటంటే.. తేజ సజ్జా, డీమోంటే కాలనీ ఫేమ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తును కలిశాడట! అజయ్, డీమోంటే కాలనీతో హారర్ థ్రిల్లర్‌లో తన సత్తా చాటాడు. డీమోంటే కాలనీ 2తో మరోసారి సక్సెస్ అందుకున్న అతడు, ఇప్పుడు డీమోంటే కాలనీ 3ని భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తేజ-అజయ్ కలయికపై అంచనాలు ఊపందుకున్నాయి. ఇది కొత్త ప్రాజెక్టా? లేక డీమోంటే 3లో తేజ కీలక పాత్ర కోసమా? అన్న ఉత్కంఠ రేగుతోంది. తేజ ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌తో జతకడితే, మరో బ్లాక్‌బస్టర్ తప్పదని అభిమానులు ఫిక్స్ అయ్యారు!