Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన అభిమానుల హృదయాల్లో స్థిరంగా నిలిచారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అపారం. అలాంటి వారిలో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. పవన్‌తో కలిసి బండ్ల గణేష్ ‘గబ్బర్ సింగ్’, ‘తీన్ మార్’ చిత్రాలను నిర్మించారు. వీటిలో ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ హిట్ కాగా, ‘తీన్ మార్’ మాత్రం ఆశించిన విజయం సాధించలేదు.
తాజాగా, బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పవన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ‘తీన్ మార్’ పోస్టర్‌తో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ అభిమానుల్లో కన్ఫ్యూజన్‌కు కారణమైంది. అకారణంగా థాంక్స్ చెప్పడం, ‘తీన్ మార్’ పోస్టర్ షేర్ చేయడంతో అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి.
Also Read: Samantha: ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన సమంత.. డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాతే ఒకే చేస్తా
Banandla Ganesh: గత కొన్నాళ్లుగా ‘తీన్ మార్’ రీ-రిలీజ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని రీ-రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. రానున్న రోజుల్లో ఈ పోస్ట్ వెనుక అసలు కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.