Teenmar Mallanna: ప్రముఖ జర్నలిస్టు, యూట్యూబర్‌గా పేరుగాంచిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి “తెలంగాణ రాజ్యాధికార పార్టీ” అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండాలను ఆవిష్కరించారు.
పార్టీ జెండా ప్రత్యేకతలు
జెండా రెండు రంగులతో రూపొందించబడింది. పైభాగంలో ఎరుపు రంగు కింది భాగంలో ఆకుపచ్చ రంగు జెండా మధ్యలో కార్మిక చక్రంను ఉంచారు.చక్రం నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలి బిగించిన మానవచేతిను చిహ్నంగా పొందుపరిచారు.ఆ చేతి ఇరువైపులా రెండు ఆలీవ్ ఆకులు పొందుపరిచారు. జెండాపై “ఆత్మగౌరవం, అధికారం, వాటా” అనే నినాదాన్ని ముద్రించారు.
