Crime News: బెంగళూరులోని ఆనేకల్ తాలూకా, హళచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఒక బాలిక మృతదేహం సూట్‌కేస్‌లో లభ్యమవడంతో కలకలం రేగింది. ఈ హృదయవిదారక ఘటనపై సూర్యనగర పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టి మానవత్వాన్ని మరిచిన ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బీహార్‌కు చెందిన అశిక్ కుమార్ అనే యువకుడు మే 13న తన స్వగ్రామానికి వెళ్లి, అక్కడే పక్క గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో మోసగించి మే 15న బెంగళూరుకు తీసుకొచ్చాడు. మే 18న నగరానికి వచ్చిన తరువాత, మే 20న బాలిక లైంగిక చర్యకు ఒప్పుకోకపోవడంతో ఆమెపై అసభ్యంగా ప్రవర్తించి, అతి కిరాతకంగా రాడ్, బీర్ బాటిల్‌లతో దాడి చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు.
ఈ అఘాయిత్యానికి పాల్పడిన తరువాత, అశిక్ కుమార్ తన బంధువులు ముఖేష్ రాజబన్షి, ఇందు దేవి, రాజారామ్, పింటూ, కాలు, రాజు కుమార్‌ల సహాయంతో బాలిక మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైల్వే బ్రిడ్జ్ దగ్గర విసిరివేశారు. నిందితులు కదులుతున్న రైలు నుంచి విసిరినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Honeymoon-Murder: రాజా-సోనమ్ ల కొత్త CCTV ఫుటేజ్ బయటపడింది, మేఘాలయలోని హోటల్ బయట కనిపించలేదు.
ఈ కేసులో నిందితుల కదలికలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. సాంకేతిక ఆధారాలతో పాటు బీహార్ పోలీసుల సహకారంతో సూర్యనగర పోలీసులు ఏడుగురు నిందితులను అక్కడే అరెస్ట్ చేశారు. మృతురాలి తండ్రి బీహార్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడింది.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులపై కఠిన చర్యలు తీసేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీయడంతో పాటు, బాలికల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.