Ravindra Jadeja: టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్ లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. నాగ్ పూర్ లో ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి, జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్స్ లో ఒకడైన రవీంద్ర జడేజా టీమిండియా జట్టుకి టెస్ట్ మరియు వన్డేలలో ఎంతో కీలకమైన ఆటగాడిగా మారాడు.
ప్రస్తుతం 600 వికెట్లకు పైగా అంతర్జాతీయ వికెట్లను సాధించిన జడేజా కంటే ముందు వరుసలో అనిల్ కుంబ్లే 953తో, రవిచంద్రన్ అశ్విన్ 765 వికెట్ లతో , 705 వికెట్లు సాధించిన హర్భజన్ సింగ్, 687 వికెట్లు పడగొట్టి కపిల్ దేవ్ మాత్రమే ఉన్నారు. అయితే భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజా కావడం మరొక రికార్డు.
ఇది కూడా చదవండి: Forest Department: ఆడపులి.. మూడు పిల్లల మరణం.. కారణం అదే.. తేల్చిన అధికారులు..
Ravindra Jadeja: ఈ ఘనత సాధించిన తరువాత, జడేజా మరో అపురూప రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా తన తాజా ప్రదర్శనతో జడేజా, ఇంగ్లండ్ వన్డేల్లో 43 వికెట్ల అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డులోకి ఎక్కాడు. ఈ మ్యాచ్ ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ భారత్ తో జరిగిన వన్డేల్లో 40 వికెట్లు తీశాడు.
ఆ పై వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో జడేజా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సనత్ 445 మ్యాచ్లో 323 వికెట్లు తీసిన జయసూర్య మొదటి స్థానంలో ఉండగా… షకీబ్ అల్ హసన్ 247 మ్యాచ్ లలో 317 వికట్లతో, డేనియల్ వెటోరీ 295 మ్యాచ్ లలో 305 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజాతో పాటుగా హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.