Anil Kumble Love Story: భారతదేశపు గొప్ప క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన అనిల్ కుంబ్లే మైదానంలో సాధించిన విజయాలు మరపురానివి. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీయడం అనేది ఎవరూ సాధించలేని ఘనత. మైదానంలో తన అసమానమైన ప్రదర్శనలకు పేరుగాంచిన అనిల్ కుంబ్లే వ్యక్తిగత జీవితం కూడా ఆయన క్రికెట్ విజయాలతో పాటు అంతే ఆసక్తికరంగా ఉంటుంది. తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌కు పేరుగాంచిన అనిల్ కుంబ్లే తన వ్యక్తిగత జీవితంతో కూడా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
1999లో అనిల్ కుంబ్లే వివాహం చేసుకున్నప్పుడు.. అతను చాలా విమర్శలను, అంతర్గత కుటుంబ వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. దానికి కారణం చేతన రామతీర్థకు అది రెండవ వివాహం కావడమే. ఆమెకు అంతకు ముందే పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. ట్రావెల్ ఏజెన్సీలో మొదలైన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని అనిల్ ఫిక్స్ అయ్యాడు. చేతన సైతం మొదటి భర్తతో తీవ్ర ఇబ్బందులు పడింది. అనిల్ పరిచయం అయిన తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి విమర్శలను లెక్కచేయకుండా అనిల్ చేతనను వివాహం చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Shardul vs Nitish: శార్దూల్ Vs నితీశ్.. తుది జట్టులో ఎవరికి ఛాన్స్…
జూలై 1, 1999న అనిల్ – చేతన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత కూడా అనిల్, చేతన కూతురు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. కూతురు అరుణిని తమకు అప్పగించాలంటూ కుంబ్లే, చేతన కోర్టులో ఎంతోకాలం పోరాడారు. చివరకు అరుణి బాధ్యతలు కుంబ్లే-చేతనకు అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో వారి సంతోషానికి అవథులు లేదు. ఆ తర్వాత ఈ జంటకు స్వస్తి, మాయాస్ జన్మించారు..